![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 (Bigg boss 9 Telugu) రోజుకో ట్విస్ట్ తో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది. బిగ్ బాస్ ఈ సారి చదరంగం కాదు రణరంగమన్నట్లు దూసుకుపోతుంది. ఈ సీజన్ లో అగ్నిపరీక్ష ద్వారా ఆరుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే రెండు వారాల్లో ఒకరు సెలబ్రిటీ, ఇంకొకరు కామన్ మ్యాన్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు.
ప్రస్తుతం హౌస్ లో అయిదుగురు కామనర్స్ ఉన్నారు అయితే బిగ్ బాస్ ఈ వీక్ లో బిగ్ ట్విస్ట్ ప్లాన్ చేయబోతున్నాడు. అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ అయిన దివ్య నిఖిత, షకీబ్, నాగ ప్రశాంత్ ముగ్గురిని మిడ్ వీక్ లో హౌస్ లోకి పంపిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ ముగ్గురిలో ఒకరు మాత్రమే హౌస్ లో ఉంటారు. ముగ్గురికి టాస్క్ లు పెట్టి ఎవరైతే విన్ అవుతారో వారిని హౌస్ లోకి పంపిస్తారంట. దాంతో పాటు హౌస్ లో ఉన్న వాళ్ళని ఓటింగ్ చేయమని వాటిని కూడా కన్సిడర్ చేసి హౌస్ లోకి కొత్త కంటెస్టెంట్ ని తీసుకొస్తున్నారంట. అయితే ఒక్కరికి మాత్రమే ఛాన్స్ అని మిగతా ఇద్దరిని హౌస్ నుండి ఎగ్జిట్ చేస్తారంట. ఇలా నెక్స్ట్ మిడ్ వీక్ కూడా మరొక ముగ్గురిని పంపించి టాస్క్ లు పెట్టి, ఒకరిని పర్మినెంట్ హౌస్ మేట్ చేసే ప్లాన్ లో బిగ్ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ వారం కూడా ఒక కామనర్ బయటకు వస్తారని తెలుస్తోంది. ఎందుకంటే ఏ ఓటింగ్ పోల్ చూసిన కామనర్స్ లీస్ట్ లో ఉన్నారు. ఇక అయిదో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందనే తెలుస్తోంది. అయిదో వారం నుండి హౌస్ లో మళ్ళీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ వార్ నడుస్తుదన్నమాట.
![]() |
![]() |